కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని కోదాడ బీఆర్ఎస్ నాయకులు బెజవాడ శ్రవణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కోదాడ ఆర్డిఓ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. బాలాజీ నగర్ లో 560 డబల్ బెడ్ రూములు టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టి లబ్ధిదారులను కూడా ఎంపిక చేసిందన్నారు.