కోదాడ పట్టణం కొమరబండ వై జంక్షన్ వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తును మల్టీ జోనల్ ఐజి సత్యనారాయణ ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికంగా ఉన్నందున పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రజిత రెడ్డి, ఎస్ఐలు ఉన్నారు.