కోదాడ నుండి లక్ష్మీ పురం వరకు గల రోడ్డు అస్తవ్యస్తంగా మారి వాన దారులకు ప్రమాదాలు జరుగుతున్నాయని సామాజిక ఉద్యమకర్త సయ్యద్ బశీరుద్దీన్ ఒక ప్రకటన లో ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు మూల మలుపు ల్లో కంప చెట్లు అలుము కొని ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు అంచులు ప్రమాద కరంగా ఉన్నాయని వాహనాలు రోడ్డు దిగి ఎక్కే క్రమంలో చక్రాలు జారి పడిపోతున్నారన్నారు.