కోదాడలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో ముంపుకు గురైన ప్రాంతాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ఆదివారం ఉదయం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎక్కడైనా ఎలాంటి ఇబ్బంది ఉన్న తమకు సమాచారం అందించాలన్నారు. ముంపుకు గురైన వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆర్డీఓ సిహెచ్ సూర్య నారాయణకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆర్డిఓ సూర్య నారాయణ, ఛైర్మన్ ప్రమీల, కమిషనర్ రమాదేవి ఉన్నారు.