మఠంపల్లి మండలం - Mattampally Mandal

వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభోత్సవం

వాలీబాల్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభోత్సవం

మఠంపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు, సూర్యాపేట జిల్లా యువజన సర్వీసులు క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడాకారుల సహకారంతో వేసవి శిక్షణ శిబిరాన్ని శుక్రవారం ఎంపీడీవో జానకి రాములు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మఠంపల్లి గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీఓ ఆంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రస్తుత హుజూర్ నగర్ నియోజకవర్గ పాఠశాలల క్రీడల కార్యదర్శి మన్నెం సీతారాం రెడ్డి తెలిపారు.

సూర్యాపేట జిల్లా
May 12, 2024, 04:05 IST/

నీ ఓటు విలువ తెలుసుకో.. మంచి నాయకుడిని ఎన్నుకో..!

May 12, 2024, 04:05 IST
రేపు హాలిడే అనుకుంటున్నారా? కాదు, పజాస్వామ్యంలో అతి ముఖ్యమైన రోజు. హాలిడే ఇచ్చారు కదా అని ట్రిప్ ప్లాన్ చేశారా? అయితే మీ తదుపరి తరాల బంగారు భవిష్యత్ కు కళ్లెం వేసినట్లే. ఓటు.. దేశ భవిష్యత్ ను, తలరాతను మార్చే ఆయుధం. అందుకే అంటారు ఓటు హక్కు ప్రతి మనిషి యొక్క వజ్రాయుధం అని. నేను ఓటు వేయకుంటే ఏమైతుందనే నిర్లక్ష్యం వద్దు. ఎక్కడ ఉన్నా సరే మే 13వ తేదీన మీ ఓటు హక్కును వినియోగించుకోండి. 5 ఏండ్లకు ఒక్కసారి ఓటు వేసే అవకాశం వస్తుంది. ఆ అవకాశం కోసం మనం 5 నిమిషాలు కేటాయించలేమా.. ప్రతి సంవత్సరం కూడా ఓటింగ్ శాతం తగ్గిపోతుంది. మరీ ముఖ్యంగా చదువుకున్న వారే ఓటు వేయకపోవడం మరీ బాధాకరం. చదువుకున్న వారు రాజకీయాలను పట్టించుకోవడం లేదు కాబట్టే అర్హత లేని వారు రాజకీయాలను ఏలుతున్నారు. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఏలుతున్నారు. నేడు ఎన్నికలన్నీ డబ్బుమయమయ్యాయి. అవన్నీ పోవాలంటే అందరూ ఓటు వేయాలి. సెలవు లేదనో, రాలేననో సాకుతో రాకుండా ఉండి ఓటు వేయకుండా ఉండవద్దు. ఎక్కడ ఉన్నా సరే ఇప్పటి నుంచే ప్రణాళిక చేసుకొని మీ ఓటు హక్కును వినియోగించుకోండి. దేశ మార్పులో పాలు పంచుకోండి. పురుషుల కంటే మహిళలే ఓటర్లుగా ఎక్కువ ఉన్నారు. ఎక్కడ ఉన్నా వస్తారు కదమ్మ. ఓటరు మహాశయా.. మరవకు నీ ఓటు. గుర్తు పెట్టుకో మే 13. తప్పకుండా ఎక్కడ ఉన్నా అందరూ వస్తారు కదూ.