ఆగి ఉన్న లారీని ఢీకొట్టి ప్రమాదానికి గురైనా లారీ డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి ఘటన మంగళవారం చోటుచేసుకుంది. చండూర్ మండలం, నెర్మెట గ్రామానికి చెందిన రాంబాబు మట్టంపల్లిలోని సిమెంట్ లోడ్ తో హైదరాబాద్ కు వస్తుండగా.. మౌంట్ ఓపెరా సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ రాంబాబుకు తీవ్ర గాయాలు కాగా.. రెండు కాళ్ళు విరిగిపోయాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు.