నాగార్జునసాగర్ అటవీ ప్రాంతంలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. నాగార్జునసాగర్ జమ్మనకోట కు వెళ్లే మార్గంలో బుధవారం సాయంత్రం ఒకేసారి మంటలు చెలరేగాయి. మంటలు గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారము అందుకున్న అటవీశాఖ, ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. వేసవికాలం కాబట్టి గడ్డి ఎండిగా ఉండడంతో ఈ ఘటనలో దాదాపు 20 ఎకరాల అటవీ కాలిపోయింది.