సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నాణ్యత విషయంలో రాజీ పడవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ పరిధిలోని పలు ఇళ్లలో నిర్వహించిన సర్వేను తనిఖీ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా చిట్యాల మున్సిపాలిటీ జిల్లాలోనే 61 శాతం సర్వేను పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది అన్నారు.