నూతన కమిటీ ఎన్నిక
పెన్ పహాడ్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీ ఎన్నికను జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు మీసాల గోవర్ధన్ అధ్యక్షతన సోమవారం ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. మండల పరిధిలోని అనంతరం గ్రామంలో గల క్రీస్తు ప్రేమ మందిరంలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఉపాధ్యక్షులు ఆర్. ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె. సైమన్, తదితరులు పాల్గొన్నారు.