సూర్యాపేట: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-3 పరీక్షలు

60చూసినవారు
సూర్యాపేట: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-3 పరీక్షలు
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సాఫీగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ నంద్ లాల్ పవార్ తెలిపారు. సోమవారం జరిగిన పరీక్షకు జిల్లాలో మొత్తం 16,543 మంది అభ్యర్థులకు గాను, 9,232 మంది హాజరు కాగా, 7,311 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు. సగటున 55.8 శాతం హాజరు నమోదయ్యిందని అన్నారు. పరీక్షలకు విధులు నిర్వహించిన అధికారులకు, సిబ్బందికి, పోలీసు అధికారులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్