ఒకే నెలలో ఆరు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం అవివేకం అని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు చిలువేరు రమేష్ గౌడ్ అన్నారు. ప్రజలు కరోనా కష్ట కాలంలో జీవనోపాధి కోల్పోయి పనికి తగిన వేతనం రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని అన్నారు. పెరిగిన ధరలు తగ్గించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు.