పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డు మరియు ఆసరా పెన్షన్లు తక్షణమే మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు చిలువేరు రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ..గత రెండు సంవత్సరాల నుండి దరఖాస్తు చేసుకున్న ఎంతో మంది వృద్ధాప్య, వితంతు, పింఛన్ల ఇప్పటి వరకు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకి గురవుతున్నారని అన్నారు. అలాగే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకి పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు జారీ విషయంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు.