వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా గత ఐదేళ్ల పాటు అసెంబ్లీలో తనదైన పాలన చేశారు. అయితే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా జగన్కు దక్కలేదు. దీంతో అసెంబ్లీలో కావాల్సినంత సేపు మాట్లాడటానికి ఉండదని జగన్ భావిస్తున్నారట. అయితే స్పీకర్ అయ్యన్న ఈ విషయంలో జగన్కు మైకు ఇస్తామని స్పెషల్ ఆఫర్ ఇచ్చారట. ప్రజల తరపున గొంతుకగా మారి వైసీపీ సభలో పోరాడాల్సి ఉంది. ఏది ఏమైనా జగన్ని ఈ సారి అసెంబ్లీ పిలుస్తోంది. మరి జగన్ వెళ్తారో లేదో చూడాలి.