సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ 37వ వార్డులో పల్స్ పోలియో

649చూసినవారు
సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ 37వ వార్డులో పల్స్ పోలియో
సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 37వ వార్డులో ఆదివారం స్థానిక కౌన్సిలర్, సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బైరు శైలేందర్ గౌడ్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అలేటి మాణిక్యం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్