నాడు గిరిజనుల కోసం పోరాటం చేసిన ఏకైక వ్యక్తి ఆదివాసి యోధుడు బిర్సా ముండా అని ట్రైకార్ డిప్యూటీ జనరల్ మేనేజర్ రవికుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం గిరి నగర్ ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహంలో ఏర్పాటు చేసిన బిర్సా ముండా జయంతి వేడుకల్లో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.