సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మెట్రో హాస్పటల్ పక్కన ఉన్న యమహా టీవీఎస్ షోరూం పక్క సందులో ఉన్న కరెంటు పోల్ కి బుధవారం లారీ తగలడంతో కరెంటు పోల్ ఒరిగింది. ఈ పోల్ ఎక్కడ కింద పడుతుందో అని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.