ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని కనకదుర్గమ్మను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సంక్రాంతి మహా పర్వదినం పురస్కరించుకొని కనకదుర్గమ్మ ను దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రాష్ట్రాలు సర్వతో ముఖాభివృద్ధి జరగాలని కోరుకున్నారు.