తుంగతుర్తి నియోజకవర్గంలో జ్వరాలు విజృంభిస్తుండటంతో హాస్పిటల్స్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఓపీ సగటున 10-30 శాతం వరకు పెరగినట్లు అధికారులు తెలిపారు. వర్షాలు కురుస్తుండటంతో గత ఇరవై రోజులుగా జ్వారల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుంది. ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి రక్త పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు శుక్రవారం సూచించారు.