నూతనకల్ మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మున్నా మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షులు కల్వకుంట్ల తారకారామారావు పుట్టినరోజు వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ కి ఆ దేవుడు ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను ఇచ్చి భవిష్యత్ లో ఉన్నత పదవులు అధిరోహించే విధంగా ఆశీర్వదించాలని దేవున్ని కోరారు.