సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల వ్యాప్తంగా ఎడతెరిపిలేని చిరుజల్లులు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు వర్షం కురుస్తూనే ఉంది. అకాల వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాగల రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.