తొలిసారి ఎన్నికల బరిలో సుష్మ స్వరాజ్ కుమార్తె

3240చూసినవారు
కేంద్ర మాజీ మంత్రి, కీర్తిశేషులు సుష్మా స్వర్వాజ్ కుమార్తె బాంసురీ స్వరాజ్ తొలిసారి ఎన్నికల్లో అడుగుపెడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల తొలి జాబితాలో బాంసురీ స్వరాజ్ పేరును బీజేపీ కేంద్ర అధిష్ఠానం శనివారం ప్రకటించింది. న్యూఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నారు. తన తల్లి సాధించిన పేరు, అందరి అంచనాలకు అనుగుణంగా పనిచేసేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పారు.

సంబంధిత పోస్ట్