కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రి వద్ద ఓ అనుమానాస్పద బ్యాగు తీవ్ర కలకలం రేపింది. అందులో బాంబు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో బాంబు స్క్వాడ్ ఘటనాస్థలానికి చేరుకుందని, ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయని అధికారులు తెలిపారు. అత్యాచారం, హత్యకు గురైన జూనియర్ డాక్టర్ చిత్రపటం పక్కనే అనుమానాస్పద బ్యాగ్ కనిపించింది. స్థానికులు నివాళులు అర్పించేందుకు ఆ ఫొటోను అక్కడ ఏర్పాటు చేశారు.