'సుట్టంలా సూసి పోతలా' సాంగ్ లిరిక్స్

60చూసినవారు
'సుట్టంలా సూసి పోతలా' సాంగ్ లిరిక్స్
అద్దాల ఓణిలా
ఆకాశవాణిలా
గోదారి గట్టుపై
మెరిసావు మణిలా

పెద్ధింటి దానిలా
బంగారు గనిలా
సూత్తానే నిన్నిలా
నా రెండు కన్నులా

కల ఉన్న కళ్ళకే కాటుకే ఏలా
మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మోతలా సందేళ పాటలా
సందల్లే తెచ్చావే నీలా

సుట్టంలా సూసి పోతలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
మ్ మ్ సేత్తానే నువ్ సెప్పిందలా

ఏ ఉత్తరాలు రాయలేను
నీకు తెలిసేలా
నా లచ్చనాలనన్ని
పూసగుచ్చేలా

ఏమౌతానంటే ఏది
సెప్పలేను వరుసలా
నీ పక్కనుండిపోతే
సాలులే ఇలా

సొట్టు గిన్నె మీద
సుత్తి పెట్టి కొట్టినట్టుగా
సుమారు కొట్టుకుందే
గుండె గట్టిగా

గంటకొక్కసారి గంట
కొట్టే గడియారమై
నిన్నే తలిసేలా

సుట్టంలా సూసి పోతలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
సేత్తానే నువ్ సెప్పిందలా

అద్దాల ఓణిలా
ఆకాశవాణిలా
గోదారి గట్టుపై
మెరిసావు మణిలా

పెద్ధింటి దానిలా
బంగారు గనిలా
సూత్తానే నిన్నిలా
నా రెండు కన్నులా

కల ఉన్న కళ్ళకే కాటుకే ఏలా
మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా
సన్నాయి మోతలా సందేళ పాటలా
సందల్లే తెచ్చావే నీలా

సుట్టంలా సూసి పోతలా
సుట్టేసుకోవే సీరలా
సక్కాని సంటివాడిలా
సేత్తానే నువ్ సెప్పిందలా

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్