విలియమ్సన్‌కు మళ్లీ టీ20 పగ్గాలు

60చూసినవారు
విలియమ్సన్‌కు మళ్లీ టీ20 పగ్గాలు
న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్‌ మళ్లీ టీ20 పగ్గాలు చేపట్టనున్నాడు. బంగ్లాదేశ్‌తో పొట్టి సిరీస్ కోసం సెలెక్టర్లు అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేశారు. గతంలో టీ20కి కెప్టెన్‌గా వ్యవహరించిన విలియమ్సన్ మళ్లీ బాధ్యతలు తీసుకోనున్నాడు. పొట్టి సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ ఆదివారం 15 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ప్రకటించింది. కాగా, డిసెంబర్ 27న బంగ్లాదేశ్‌తో తొలి సిరీస్ ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్