టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, పాక్ క్రికెట్ జట్లు ఆదివారం తలపడనున్నాయి. అయితే మ్యాచ్ జరగనున్న న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ప్రస్తుతం వర్షం పడుతోంది. దీంతో టాస్‌ను అంపైర్లు వాయిదా వేశారు. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు.