కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వక్ఫ్ సవరణ బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో వక్ఫ్ పరిరక్షణ మహా సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు ముస్లిం సంప్రదాయాలకు విరుద్ధం అన్నారు. వైఎస్ జగన్ ఎప్పుడూ ముస్లింలకు అండగా నిలుస్తారని తెలిపారు. వక్ఫ్ సవరణలో 8 అంశాలను వైసీపీ వ్యతిరేకించింది.. వైసీపీ తరఫున తాము డీసెంట్ నోట్ కూడా ఇచ్చామని పేర్కొన్నారు.