తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా!

84చూసినవారు
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా!
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం నిర్వహిస్తామని చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆదివారం ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపింది. 'ది ఐకానిక్ తండేల్ జాతరను రేపటికి వాయిదా వేస్తున్నాం. ఈవెంట్ భారీ స్థాయిలో ఉంటుంది. ఈ పాలి యాట గురితప్పేదే లేదేస్' అని మూవీ డైలాగ్ స్టైల్‌లో పోస్టు పెట్టింది. కాగా ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరుకానున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్