కార్ల తయారీసంస్థ
టాటా మోటార్స్ వివిధ మోడల్ కార్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. ఎలక్ట్రిక్ కార్లతోపాటు ఐసీఈ మోడల్ కార్లపైనా డిస్కౌంట్లు ఇస్తోంది. టియాగో, ఆల్ట్రోజ్, నెక్సాన్, సఫారీ, హారియర్ వంటి కార్లపై గరిష్టంగా రూ.55 వేలు.. ఈవీలలో టియాగో, టైగోర్, పంచ్, నెక్సాన్ కార్లపై గరిష్టంగా రూ.1.35 లక్షల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్లు ఈ నెలాఖరు వరకూ అమల్లో ఉంటాయి.