మూడింతలు పెరిగిన టాటా మోటార్స్‌ లాభాలు

74చూసినవారు
మూడింతలు పెరిగిన టాటా మోటార్స్‌ లాభాలు
ప్రముఖ వాహన కంపెనీ టాటా మోటార్స్‌ లాభాలు భారీగా పెరిగాయి. జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. ఇదే సమయంలో టాటా మోటార్స్‌ మొత్తం ఏకీకృత ఆదాయం రూ.1,05,932.35 కోట్ల నుంచి రూ.1,19,986.31 కోట్లకు పెరిగింది. నికర లాభం 259 మిలియన్‌ పౌండ్ల నుంచి 1.4 బిలియన్‌ పౌండ్లకు పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్