పాకిస్థాన్ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా

84చూసినవారు
పాకిస్థాన్ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఐర్లాండ్‌పై సునాయాస విజయం సాధించిన భారత్ అరుదైన రికార్డు సాధించింది. టీ20 వరల్డ్ కప్‌ టోర్నమెంట్‌లో అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఐర్లాండ్‌పై విజయంతో టీ20 వరల్డ్ కప్‌లో భారత్ మొత్తం 29 విజయాలు సాధించింది. పాకిస్థాన్‌పై సూపర్ ఓవర్ విజయంతో కలుపుకొని 29 విజయాలు నమోదు చేయగా 28 విజయాలతో పాకిస్థాన్ రెండో స్థానానికి పడిపోయింది. ఇక 32 విజయాలతో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్