జట్టులో గ్రూపులు లేవని భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైనప్పటి నుంచి ప్లేయర్లమంతా ఎప్పుడూ విడివిడిగా కూర్చోలేదని, టీమ్‌గానే ఉంటున్నామని వెల్లడించారు. అయితే ఈ వ్యాఖ్యల్ని అజయ్ జడేజా, నెహ్రా తప్పుపట్టారు. గతంలో జట్టుగా కలిసి కూర్చోలేదా? ఇప్పుడే కొత్తగా మొదలుపెట్టినట్లు సూర్య చెబుతున్నారని జడేజా విమర్శించగా, ఈ మార్పునకు ఇంత టైమ్ ఎందుకు పట్టిందని నెహ్రా ప్రశ్నించారు.