మల్లె సాగులో మెళకువలు

82చూసినవారు
మల్లె సాగులో మెళకువలు
మల్లె సాగులో మెళకువలు పాటిస్తే మంచి దిగుబడిని సాధించవచ్చు. ఒండ్రు మట్టి, పొడి ఇసుక నేలల్లో, నీటి సదుపాయం కింద మల్లె సాగు అనుకూలం. నేలను బాగా దున్ని 60 సెం.మీ. లోతు గుంతను తీసి, ఆ గుంతలో తీసిన పై మట్టికి 25-30 కిలోలు పశువుల ఎరువు కలిపి నింపాలి. వర్షాకాలం ప్రారంభంలో నాటుకోవాలి. కొమ్మ కత్తిరింపులుగాని, అంటు మొక్కలు తొక్కడం ద్వారా గానీ నాటుకోవాలి. నేల స్వభావాన్ని బట్టి 8-10 రోజులకొకసారి తడి ఇవ్వాలి. మొక్క ఎదగటానికి, పూలు పూయటానికి నేలలో తగినంత తేమ అవసరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్