BREAKING: ఏపీ ఎన్నికలు.. సీఎస్ కీలక సూచనలు

232909చూసినవారు
BREAKING: ఏపీ ఎన్నికలు.. సీఎస్ కీలక సూచనలు
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జవహర్ రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఇవాళ సమావేశమయ్యారు. ఎన్నికల సన్నద్ధత, ఎన్నికల కోడ్ అమలుపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ వెబ్‌సైట్లలో నేతల ఫోటోలు తీసేయాలని సీఎస్ ఆదేశించారు. సంక్షేమ పథకాల్లో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయొద్దని, నరేగా కింద కొత్త పనులు చేపట్టకూడదని సీఎస్ స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ఏపీ సీఈఓ ఎంకే మీనా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్