రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సీఎం స్థాయిని దిగజార్చేలా ఉన్నాయని.. తెలంగాణ పరువు తీస్తున్నారని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎవరో రాసిచ్చిన పాఠం చదవడం రేవంత్ మానేస్తే మంచిది. 420 హామీలొద్దు. అశోక్ నగర్ పేరు వింటే రేవంత్‌కు భయమేస్తోంది. రాష్ట్ర ఆదాయం, అప్పులపై చర్చకు మేం సిద్ధమే. సెక్యూరిటీ లేకుండా సీఎం మూసీ ప్రాంతంలో తిరిగి చూపించాలి' అని డిమాండ్ చేశారు.