దేశ రక్షణ విషయంలో తెలంగాణ మరో ముందడుగు వేసిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సముద్రంలో ప్రయాణించే నౌకలను మానిటరింగ్ చేయడానికి వీఎల్‌ఎఫ్ రాడార్ కేంద్రాన్ని దామగుండంలో ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. రాడార్ కేంద్రంతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ మంగళవారం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.