ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో పలు సంఘాలు ఇవాళ భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగానే కాక.. తెలంగాణ రాష్ట్రంలోనూ బంద్ కొనసాగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు.. వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు.