భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే లేడీ కొరియోగ్రాఫర్‌గా, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా రాణిస్తున్న ధనశ్రీ వర్మ తెలుగు సినిమాలో నటించనున్నట్లు సమాచారం. టాలీవుడ్ సర్కిళ్లలో ఈ వార్త హల్చల్ చేస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే ఓ పెద్ద సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది.