TG: మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) ద్వారా ఏర్పాటు చేయనున్న వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్లకు త్వరలోనే టెండర్లు ఖరారు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. టెండర్లు పూర్తయ్యేనాటికి సంఘాలను గుర్తించి, భూసేకరణ, బ్యాంకుల నుంచి ఆర్థికసాయం వంటి పనులను గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా కలెక్టర్లు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకి 4 ఎకరాలు చొప్పున ప్రతిజిల్లాలో కనీసం 150 ఎకరాలు, రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల ఎకరాలను సేకరించాల్సి ఉంటుందన్నారు.