హైదరాబాద్‌లోని GHMC ప్రధాన కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని గురువారం కాంట్రాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఏడాదిగా బిల్లులు చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. బిల్లులు వెంటనే చెల్లించాలని GHMC కమిషనర్ ఇలంబర్తికి వినతి పత్రం సమర్పించారు. దీంతో స్పందించిన కమిషనర్.. వచ్చే నెలలో రూ.200 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.