ఈవీఎంలపై కాంగ్రెస్ అనుమానాలు లేవనెత్తుతున్న వేళ ఆ పార్టీకి బీజేపీ పార్టీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. ఈవీఎంలపై అనుమానాలున్నప్పుడు ఎన్నికలు ద్వారా గెలిచిన ఆ పార్టీ ముఖ్యమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ ముఖ్య నేతలైన రాహుల్, ప్రియాంక వెంటనే రాజీనామా చేయాలని పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అన్నారు .కాంగ్రెస్ ఆరోపణలన్నీ అవాస్తవమని అన్నారు.