నైజీరియాలోని యోబే రాష్ట్రంలో ఈ
నెల 1వ తేదీన దారుణ ఘటన జరిగింది. ఈశాన్య నైజీరియాలోని బోకోహరమ్ కు చెందిన 50 మంది ఇస్లామిక్ ఉగ్రవాదులు.. బైకులపై తర్మువా కౌన్సిల్ ప్రాంతానికి చేరుకుని గ్రామంలోని మార్కెట్‌పై, ఇళ్లపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపు 100 మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారని గ్రామస్తులు బుధవారం తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను బాబాంగిడ జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.