TG: ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ గడువు పెంపు

59చూసినవారు
TG: ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ గడువు పెంపు
తెలంగాణ వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి అన్ని రకాల కాలేజీల్లో ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ లో చేరేందుకు ప్రవేశాల గడువును పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన వెలువరించింది. జులై 31వ తేదీ వరకు ఇంటర్‌ ప్రవేశాలకు అవకాశం కల్పిస్తూ గడువు తేదీని పెంచింది. కాగా జూన్‌ 28న టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కాగా.. ఈ పరీక్షలకు మొత్తం 51,237 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. వీరిలో బాలురు 31,625 మంది, బాలికలు 19,612 మంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్