సెక్రటేరియట్‌లో శనివారం గద్దర్ అవార్డ్స్ కమిటీ సమావేశం జరిగింది. Dy. CM భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉత్తమ చిత్రం, రెండో ఉత్తమ చిత్రం పురస్కారాలు గురించి చర్చించారు. ఉత్తమ చిత్రం విభాగంలో గోల్డెన్ మొమెంటో, 5 లక్షల రివార్డు.. రెండో విభాగంలో సిల్వర్ మెమొంటో, 3 లక్షల క్యాష్ రివార్డు ఇవ్వాలని నిర్ణయించారు. డైరెక్టర్, హీరో, నటీమణులకు కూడా పురస్కారాలను అందజేయాలని నిర్ణయించారు.