TG: రానున్న 3 రోజులు భారీ వర్ష సూచన

17477చూసినవారు
TG: రానున్న 3 రోజులు భారీ వర్ష సూచన
తెలంగాణకు నేటి నుంచి 3 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఎల్లుండి HYD, RR, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మెదక్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్