నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఓ దుర్మార్గపు తల్లిదండ్రులు బాలుడిని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఎండీ ఫరీద్ ఉద్దీన్(10) అనే బాలుడిని వీరు దత్తత తీసుకున్నారు. స్థానిక సమాచారం ప్రకారం.. ఇంట్లో నుంచి కేకలు రావడంతో అక్కడివారు ఇంటి తలుపులు పగలగొట్టారు. లోపలికి వెళ్లి చూసే సరికి ఫరీద్ ఉద్దీన్ తీవ్ర గాయాలతో ఇంట్లో పడి ఉన్నాడు. దీంతో స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.