తెలంగాణలో మొక్కులు తీర్చుకోవడం కోసం ఓ మహిళ ఏకంగా 2 కిలోల నువ్వుల నూనె తాగింది. ఆదిలాబాద్ (D) నార్నూర్(M) ఖాందేవ్ జాతరలో MLA కోవా లక్ష్మి సమక్షంలో తోడసం వంశానికి చెందిన నాగోబాయి ఈ సాహసం చేశారు. ప్రతి ఏటా పుష్యమాస పౌర్ణమి రోజున తోడసం వంశానికి చెందిన మహిళ ఇలా నూనె తాగడం ఆనవాయితీగా వస్తుంది. మూడు సంవత్సరాల పాటు ఒకరు నూనె తాగడం ఆచారం. ఈ ఏడాదితో నాగోబాయి మూడోసారి నూనె తాగారు. ఇలా చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మకం.