AP: సంక్రాంతి వేళ తీరిక దొరకడంతో మంత్రి నిమ్మల పొలం పనులు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. తాను చదువుకునేటప్పుడు, కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న రోజుల్లో కూడా సొంతూరు ఆగర్తిపాలెంలో వ్యవసాయం చేసే వాడినని చెప్పారు. పొలం పనులు చేయడం సంతృప్తినిచ్చిందన్నారు. రైతులందరూ పాడి పంటలతో, సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.