టీ కాంగ్రెస్ నేతల కీలక భేటీ ముగిసిన అనంతరం.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. త్వరలో సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ ఉంటుందని తెలిపారు. ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు భర్తీ చేస్తామని తెలిపారు. ‘కేబినెట్ విస్తరణ అంశంపై సీఎం, అధిష్టానం కలిసి నిర్ణయం తీసుకుంటారు. జీహెచ్‌ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశామని చెప్పారు.