TGSRTC MD సజ్జనార్ సోషల్ మీడియాలో పలు వీడియోలు షేర్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆయన 'అదృష్టవంతుడు.. రెప్పపాటులో బయటపడ్డాడు' అంటూ ఓ షాకింగ్ వీడియోని షేర్ చేశారు. 'చిన్నారులను రహదారుల వెంట తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. అందరికీ ఈ బుడ్డోడిలా అదృష్టం వరించదు' అంటూ ఆ వీడియో కింద రాసుకొచ్చారు.