ఏపీలో అరుదైన నరాల వ్యాధి గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో జీబీఎస్ సోకినవారికి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగానే ప్రభుత్వం చికిత్స అందిస్తోంది. ఈ వ్యాధి చికిత్సకు ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్లు వాడతారు. రోజుకు నాలుగైదు ఇంజెక్షన్లు చేయాలి. వీటి ఖరీదు రూ.30 వేల పైన ఉంటుంది. ఒక్కో రోగికి రోజుకు రూ.లక్ష పైన ఖర్చవుతుంది.